
మహాత్మా గాంధీ బాటలో నరేంద్ర మోదీ
స్వదేశీ వస్తువుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళుతోందని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీ స్ఫూర్తితో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో కరోనా, రక్షణ, ఆరోగ్య తదితర రంగాల్లో ఎన్నో వస్తువులు తయారు చేసుకుంటున్నామని... ప్రపంచ దేశాలు ఇప్పుడు మనవైపు చూస్తున్నాయని ఆయన అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్ బన్సల్‌లు వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘గతంలో ఏ చిన్న వస్తువునైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఎన్-95 మాస్క్‌లు, యుద్ధ విమానాల వరకు అనేక వస్తువులను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగాం. స్వాతంత్య్ర ఉద్యమంలోనే గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి..భారతీయుల ఆత్మగౌరవం పెంచాలని చెప్పారు. ఈ ఆలోచనలతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోంద’ని అన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఊతమివ్వడానికి పార్టీ కార్యకర్తలు నేత వస్త్రాలను కొనుగోలుచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చేనేత స్టాళ్లను భాజపా నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో భాజపా నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు.
పొద్దస్తమానం భాజపా ఆఫీసులో ఉంటారా?
రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
‘భాజపా రాష్ట్ర కార్యాలయంలోకి రోజూ వస్తున్నారు.. పొద్దస్తమానం ఇక్కడే కూర్చుంటున్నారు..’ అంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిలకు నివాళులు అర్పించి, అనంతరం ఎదురుపడ్డ ఇంటెలిజెన్స్ అధికారులను పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారంటూ కిసన్రెడ్డి ప్రశ్నించారు. మరోసారి కార్యాలయంలోకి రావొద్దని అన్నారు. ‘ప్రగతిభవన్, తెలంగాణభవన్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల్ని పెడితే అంగీకరిస్తారా..?’ అంటూ మండిపడ్డారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు