పల్లెబాట పట్టిన నగరం

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరం నుంచి పల్లె బాట పట్టారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులుతీరాయి. శనివారం ఒక్క రోజే 46 వేల వాహనాలు పంతంగి టోల్‌ ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి. వారాంతాల్లో సుమారు 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పండగ నేపథ్యంలో శనివారం 11 వేల    వాహనాలు అధికంగా వెళ్లాయి. ఆదివారమూ రద్దీ కొనసాగింది. చౌటుప్పల్‌ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ విధానాన్ని అమలుచేస్తుండటంతో పాటు జీఎమ్మార్‌ గుత్తేదారు సంస్థ అదనపు ఏర్పాట్లు చేయడంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగాయి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు