TSRTC: ఇక ఆర్టీసీ బ్రాండ్‌ తాగునీరు.. మార్కెట్‌లోనూ విక్రయాలకు యోచన!

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల సేవలతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయం దిశగా.. తెలంగాణ ఆర్టీసీ చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తుండగా.. త్వరలో సీసాలతో మంచినీటి (వాటర్‌ బాటిళ్లు) విక్రయాలకూ రంగం సిద్ధం చేస్తోంది. సొంత బ్రాండ్‌ పేరిట ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించేందుకు గత వారంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆమోదముద్ర పడింది. అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ప్రముఖ కంపెనీల ద్వారా మంచినీటి బాటిళ్లను తయారు చేయించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మీదట సొంత బ్రాండ్‌ నీటినే ఇచ్చేందుకు నిర్ణయించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని