భవనం శిథిలం.. శిరస్త్రాణమే శరణ్యం!

పక్క చిత్రంలో కనిపిస్తున్న ఉద్యోగులు శిరస్త్రాణం ధరించి విధులు నిర్వహిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా.. భవనం పైకప్పు నుంచి పెచ్చులూడి పడుతుండడమే దీనికి కారణం. నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు నుంచి రోజూ పెచ్చులూడి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ప్రాణరక్షణ కోసం ఇలా హెల్మెట్‌ ధరించి ఉంటున్నారు.

- న్యూస్‌టుడే, భైంసా


మరిన్ని

ap-districts
ts-districts