విదేశాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఈనాడు, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలు సోమవారం వివిధ దేశాల్లో ఘనంగా కొనసాగాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అజ్మాన్‌లో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆడిటోరియంలో యూఏఈ తెలంగాణ సాంస్కృతిక సంఘం, తెలంగాణ జాగృతి, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అయిదువేల మంది పాల్గొన్నారు. తెలంగాణ గాయని తేలు విజయ బతుకమ్మ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమిరేట్స్‌ తెలంగాణ సంఘం అధ్యక్షుడు సత్యం రాధారపు, వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌, తెలంగాణ జాగృతి యూఏఈ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు అరె శేఖర్‌గౌడ్‌, తెలుగు సంఘం ఛైర్మన్‌ దినేశ్‌ తదితరులు పాల్గొన్నారు. లండన్‌ నగరంలో తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రవాస భారతీయ మహిళలు బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు. వ్యక్తిగత పనులపై ఇటీవల యూకే వెళ్లిన రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు అక్కడి తెలంగాణ ఆడపడచులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూకే శాఖ అధ్యక్షుడు బల్మూరి సుమన్‌రావు, ప్రతినిధులు, ఉదయ్‌ బోయపల్లి, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు