త్వరితగతిన ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. బుధవారమిక్కడ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘నిర్మాణం ప్రారంభించిన 2,28,529 డబుల్‌ బెడ్రూం ఇళ్లలో 1,29,528 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 58,350 ఇళ్లు తుది దశలో ఉన్నాయి. మిగతా 40,651 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన, తుది దశలోని ఇళ్లకు మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’అని మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు.


మరిన్ని