డిమాండ్లు అమలైతేనే పోడు సర్వే

అప్పటి దాకా గ్రామసభల్లో పాల్గొనబోం
రాష్ట్ర అటవీ ఉద్యోగుల తీర్మానం

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అటవీశాఖ రేంజర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ షౌకత్‌ అలీ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో అటవీ శాఖ రాష్ట్ర రేంజ్‌ అధికారులు, జూనియర్‌ రేంజ్‌ ఆఫీసర్ల సంఘాల సమావేశంలో బుధవారం మాట్లాడారు. పోడు సర్వేలో కలెక్టర్ల జోక్యం ఎక్కువగా ఉందని ఆరోపించారు. ప్రతి మండల కేంద్రంలో పోలీసు స్టేషన్‌ మాదిరిగా అటవీస్టేషన్లను ఏర్పాటు చేయాలని, తమ రక్షణకు ఆయుధాలివ్వాలని, శ్రీనివాసరావు కుటుంబానికి రూ.5కోట్లు పరిహారం, జిల్లా కేంద్రంలో ఇల్లు, భార్యకు గెజిటెడ్‌ ర్యాంకు ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోడు సర్వే, గ్రామసభల్లో పాల్గొనేది లేదని తేల్చిచెప్పారు. అనంతరం పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌, చీఫ్‌ కన్సర్వేటర్‌ కంపా లోకేశ్‌ జైశ్వాల్‌కు వినతిపత్రం అందించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు