ఐఐటీహెచ్‌ పీఆర్వోకు పీఆర్‌సీఐ అవార్డు

ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హెచ్‌ పీఆర్వో మిథాలీ అగర్వాల్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు దక్కింది. డిజిటల్‌ మార్కెటింగ్‌కు సంబంధించి ఫ్యూచర్‌ రెడీ విభాగంలో ఆమె ఈ  పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో కోల్‌కతాలో నిర్వహించిన 16వ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ కాన్‌క్లేవ్‌లో.. పశ్చిమబెంగాల్‌ వ్యవసాయశాఖ మంత్రి సోవన్‌దేబ్‌ ఛటోపాధ్యాయ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నట్లు బుధవారం ఆమె తెలిపారు. ప్రజాసంబంధాల రంగంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఆద్విక’ మేగజీన్‌కు ఆమె సంయుక్త ఎడిటర్‌గానూ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మిథాలీ అగర్వాల్‌కు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌మూర్తి అభినందించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు