తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి ‘శ్రీసత్యసాయి అవార్డ్‌’

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఏడుగురు మహిళలకు ‘శ్రీ సత్యసాయి అవార్డ్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌’ పురస్కారాలను బుధవారం అందజేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర సమీప ముద్దేనహళ్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు మధుసూదన్‌సాయి పురస్కారాలను అందించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ డాక్టర్‌ నీర్జా బిర్లా, దివ్యాంగ క్రీడాకారిణి మాలతి హొళ్లా, ఒడిశాకు చెందిన డాక్టర్‌ తులసీ ముండా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కౌశల్య బాయి, తమిళనాడుకు చెందిన ఆర్‌.రంగమ్మాళ్‌, న్యాయవాది గౌరీ కుమారి పురస్కారాలు అందుకున్నారు.


మరిన్ని