
లక్ష పేజీల సమాచారం లభ్యం!
రామచంద్రభారతి ఫోన్లో వందల సంఖ్యలో చాటింగ్‌లు
ల్యాప్‌టాప్‌లోనూ కీలక ఆధారాలు!
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. ఏకంగా లక్ష పేజీల నిడివి ఉండే సమాచారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిని విశ్లేషించడంతో పుంఖానుపుంఖాలుగా కీలక ఆధారాలు సిట్ చేతికి చిక్కినట్లు తెలుస్తోంది.
* ముఖ్యంగా 7075779637 నంబరుతో కూడిన శామ్సంగ్ మొబైల్‌ను రామచంద్రభారతి వినియోగించారు. ఆ ఫోన్లో 8762090655 వాట్సప్ నంబరుతో విరివిగా చాటింగ్లున్నాయి. 9110662741 నంబరుతో కూడిన మరో ఫోన్ దొరికింది. ఫామ్‌హౌస్‌లో ఆ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఆ సమయంలో పోలీసులు అడిగిన వెంటనే రామచంద్రభారతి స్వచ్ఛందంగా ఆ ఫోన్ల పాస్‌వర్డ్‌లను వెల్లడించారు. అనంతరం వాటి నుంచి సమాచారం సేకరించడంతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి విశ్లేషించారు. అప్పటికే తొలగించిన డేటానూ రికవరీ చేశారు. ఈ క్రమంలో భారీమొత్తంలో సమాచారం లభ్యమైంది.
* ఆ ఫోన్ల నుంచి సునీల్‌కుమార్ బన్సల్, బీఎల్ సంతోష్, తుషార్ వెల్లాపల్లికి పంపిన మెసేజ్‌లున్నాయి. నిందితుడు నందకుమార్‌తో వందల సంఖ్యలో చాటింగ్‌లను గుర్తించారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే విషయంలో ఇద్దరి మధ్య సంభాషణలున్నాయి. భారతికి చెందిన డెల్ ల్యాప్‌టాప్‌నూ సీజ్ చేశారు. వీటన్నింటినీ విశ్లేషించి పెద్దఎత్తున సమాచారాన్ని సేకరించారు.
40 సర్వర్లలో డేటా సేకరణ
నిందితులతోపాటు అనుమానితులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందినవారు కావడంతో పోలీసులు ఆయా ప్రాంతాల నుంచి డేటా సేకరించారు. హైదరాబాద్, ఫరీదాబాద్, తిరుపతి, దిల్లీ, బెంగళూరు, కొచ్చి, ఎర్నాకుళం.. తదితర ప్రాంతాల్లో ఉన్న వీరు సెల్ఫోన్లలో సంభాషణలు సాగించారు. మెసేజ్‌లనూ షేర్ చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని సుమారు 40 సర్వర్ల నుంచి సిట్ బృందం సమాచారాన్ని తెప్పించింది. ల్యాప్‌టాప్‌ల్లోని సమాచారాన్ని క్రోడీకరించింది. ఇదంతా దాదాపు లక్ష పేజీల మేర ఉంటుందని తెలుస్తోంది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!