బుద్ధిజానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెమినార్‌: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో బుద్ధిజానికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భూటాన్‌ నుంచి వచ్చిన 24 మంది బౌద్ధ ప్రతినిధులు బుధవారమిక్కడ పర్యాటకభవన్‌లో మంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో బుద్ధిజం అభివృద్ధికి ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశం నాగార్జునసాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినట్లు మంత్రి ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి భూటాన్‌ ఆసక్తిగా ఉందన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని