నేడు పాలమూరు వర్సిటీ స్నాతకోత్సవం

హాజరు కానున్న గవర్నర్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: పాలమూరు విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం గురువారం నిర్వహించనున్నారు. క్యాంపస్‌ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై అధ్యక్షత వహించనున్నారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి బి.జె.రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. మొదటి స్నాతకోత్సవం 2014 నవంబరులో, రెండోది 2019 మార్చిలో జరిగింది. గురువారం జరిగే స్నాతకోత్సవంలో ఆరుగురికి పీహెచ్‌డీ డిగ్రీలు, 73 మందికి బంగారు పతకాలు, 2,932 మందికి పీజీ డిగ్రీలు, 30,645 మందికి యూజీ డిగ్రీలను అందజేయనున్నారు.


మరిన్ని