కాగజ్‌నగర్‌ అడవుల్లో కెమెరాకు చిక్కిన చిరుతలు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: కుమురంభీం జిల్లాలో మొన్నటి వరకు పులులు హడలెత్తించాయి. వారం క్రితం రైతును చంపిన ఏ3 పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోకి వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. కాగజ్‌నగర్‌ అటవీప్రాంతంలో పులులతో పాటు చిరుతల సంఖ్య కూడా పెరిగినట్లు ఇటీవల ట్రాప్‌ కెమెరాల్లో చిక్కిన దృశ్యాలతో స్పష్టమవుతోంది. అటవీ అధికారులు అమర్చిన ట్రాప్‌ కెమెరాల్లో ఈ నెల 9, 10 తేదీల్లో మూడు చిరుతల సంచారం నమోదైంది.


మరిన్ని