
సైబరాసురులతో జాగ్రత్త...
‘నేనో ఎన్నారైని. కావాల్సినంత డబ్బుంది.. కానీ అర్థం చేసుకునే వాళ్లే లేరు. ఇండియాకొస్తా... పెళ్లి చేసుకుందాం’... అంటే నిజమనుకుని సానుభూతి చూపిస్తారు. ఫేస్బుక్లో, ఇన్‌స్టాలో.. ఫాలో అయిపోతూ ‘లవ్ యూ’ అంటే ‘ఐ టూ...’ అంటూ వెనకాముందూ చూడకుండా ప్రేమలో మునిగిపోతున్నారు! అమ్మాయిలు చేస్తున్న ఈ పొరపాట్లు వాళ్లని అగాథంలోకి నెట్టేస్తున్నాయి. ఇలా సైబర్ వలలో చిక్కుకోకుండా అడిషనల్ డీసీపీ (షీ టీమ్స్- హైదరాబాద్) శిరీషా రాఘవేంద్ర చెప్పిన సూచనలివి...
సానుభూతితో చేరువవుతారు సైబర్ మోసగాళ్లు. ‘అమ్మానాన్నా లేరు.. ఒంటరితనంతో బతకలేకపోతున్నా, నువ్వు జీవితంలోకి వస్తే హ్యాపీ...’ అంటూ మాయమాటలు చెప్పగానే కొందరు అమ్మాయిల మనసు కరిగిపోతుంది. ఇంకొందరైతే అమ్మానాన్నల్ని ఒప్పించి ఇంట్లోనే ఉండనిస్తున్నారు. వాడు అన్ని అవసరాలూ తీర్చుకుని ఉడాయిస్తాడు. ఇంకొందరు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. స్నేహితుల్లో పెద్ద హోదాల్లో ఉన్న వాళ్లు కనిపించేలా సృష్టిస్తారు. నమ్మి దాన్ని యాక్సెప్ట్ చేస్తే, చాట్ చేసి రెండ్రోజుల తర్వాత కనిపించరు. ఏమైందంటే యాక్సిడెంట్ అనో, ఆర్థిక ఇబ్బందులనో డబ్బు సర్దమంటారు. మోసగాళ్లు ఎన్ఆర్ఐ అవతారమెత్తుతున్నారీ మధ్య. ‘డబ్బుంది, ఇండియా తిరిగి వచ్చేస్తా. పెళ్లి చేసుకుని అక్కడే బిజినెస్ చేస్తా’నంటాడు. నమ్మేస్తారు. కొద్దిరోజులకి ఫోన్‌చేసి దిల్లీలో కస్టమ్స్ వాళ్లు అడ్డుకున్నారు డబ్బు కావాలంటాడు, లేదంటే దిల్లీకి రమ్మంటాడు. వీళ్లకి డబ్బూ, అమ్మాయిలూ రెండూ కావాలి. వీరి ప్రధాన ఆయుధం సానుభూతి. తెలియని వాళ్ల ఫోన్లూ, మెసేజ్‌లూ, ఫ్రెండ్ రిక్వెస్ట్లూ వస్తే నమ్మి సానుభూతి చూపించొద్దు. ఒకవేళ నిజమేననిపిస్తే తల్లిదండ్రులకూ చెప్పండి.
డేటింగ్ యాప్స్ వద్దే వద్దు!
ప్రేమ, పెళ్లి అంటే కులమతాలూ, అసమానతలూ అడ్డొస్తాయని కొంతమంది అమ్మాయిలు వాటి జోలికిపోరు. కానీ ఎవరికీ తెలియదని డేటింగ్ యాప్‌లలో నమోదు చేసుకుంటారు. అక్కడ కాచుకుని ఉంటారు మోసగాళ్లు. మాయ మాటలు చెప్పి దగ్గరవుతారు. ఎవరికీ కనిపించకుండా ఏదైనా లాడ్జ్‌లో కలుద్దాం అంటారు. అక్కడ హద్దులు మీరతారు. ఫొటోలూ దిగుతారు. తర్వాత ఆ ఫొటోల్ని బయటపెడతానని బెదిరించి డబ్బులడుగుతాడు. మళ్లీ మళ్లీ రావాలంటాడు. స్నేహితుల్నీ తీసుకొస్తాడు. చిన్నపాటి సరదాల కోసం జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దు. డేటింగ్స్ యాప్స్ అస్సలు పెట్టుకోకండి.
ఫేస్‌బుక్‌తో జాగ్రత్త!
మాకొచ్చే ఫిర్యాదుల్లో ఫేస్బుక్ వినియోగదారులే ఎక్కువ. ఇక్కడ మోసాలు అనేక రకాలు. చాలామంది అమ్మాయిలు మోడ్రన్ దుస్తుల్లో ఫ్రెండ్స్‌తో, బాయ్‌ఫ్రెండ్స్‌తో ఫొటోలు దిగి వాటిని షేర్ చేస్తుంటారు. ఇలాంటి వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో పెడతారు కొందరు. ఇంకొందరైతే మార్ఫింగ్ ఫొటోల్ని వారి స్నేహితులకి పంపిస్తారు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులడుగుతారు. జల్సాలకు అలవాటైన, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుర్రాళ్లు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. స్నేహితుల్లో విడిపోయిన ప్రేమికుల్ని గుర్తించి వాళ్లు క్లోజ్‌గా దిగిన ఫొటోల్ని చూపించి బయటపెడతామని బెదిరిస్తున్నారు. సరదాగా తీసుకున్న ఫొటోలు ఎప్పుడైనా ఇబ్బంది పెడతాయన్న సంగతి గుర్తెరిగి హద్దుల్లో ఉండాలి. అమ్మాయిల పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు తప్పుడు అకౌంట్లు సృష్టిస్తుంటారు. కాబట్టి ఎవరికీ ఫోన్ నంబర్లూ, ఈమెయిల్ ఐడీలూ షేర్ చేయొద్దు. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఎక్కడనుంచైనా ఆ పని చేస్తారు. వీళ్లని పట్టుకోవడం కష్టసాధ్యం. మీ ప్రొఫైల్‌ని ఇతరులు చూడకుండా లాక్ చేయడమే కాదు, అలాంటి ఫొటోలు తీసుకోవద్దు.
తల్లిదండ్రులూ, టీచర్లదీ బాధ్యత!
ఆన్లైన్ చదువుల కారణంగా స్కూల్ పిల్లల చేతికీ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. దీంతో అశ్లీల సమాచారం, వీడియోలూ చూడ్డం ఎక్కువైంది. కౌమారం, యవ్వనంలో ఉన్న పిల్లలచేత ఆన్లైన్ మోసాల గురించి వస్తోన్న వార్తల్ని చదివించాలి. బాధితుల్లో ప్రఖ్యాత విద్యాసంస్థల పిల్లలూ ఉంటున్నారు. మార్కులు తగ్గినా, ప్రవర్తనలో మార్పు వచ్చినా అనునయంగా మాట్లాడితే వాళ్లే సమస్యల్ని చెబుతారు. పిల్లలు సరైన మార్గంలో వెళ్లేలా టీచర్లూ బాధ్యత తీసుకోవాలి. చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసానికీ సమయం కేటాయించాలి. అమ్మాయిలు కూడా సమస్య ఉంటే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదంటే పోలీసులకు చెబితే దాన్నుంచి బయట పడేలా చూస్తాం. కానీ అసలు సమస్యల్లో చిక్కుకోకుండా ఉండటమే మేలు. మంచి లక్ష్యం పెట్టుకొని చదువులూ, శారీరక దృఢత్వంపైనా, కెరియర్‌పైనా దృష్టి పెట్టండి. అంతలోపే జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
ప్రాంక్ అంటాడు!
నెలలో అమ్మాయిని ప్రేమలో పడేస్తానని స్నేహితులతో పందెం కాస్తారు కొందరు. ఫోన్, సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సంప్రదించి ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. ఇదంతా తెలీక నిజంగానే ప్రేమిస్తారు కొందరు. కొన్నాళ్లకు ప్రాంక్ అని చెబుతాడు.
మనం ఇతరుల కంటే భిన్నంగా ఉండాలంటే మన ఆశలూ ఆశయాలూ బలంగా, మెరుగ్గా ఉండాలి. మా అమ్మానాన్నలు నన్ను మెకానికల్ ఇంజినీరింగ్ చదవమన్నారు. కానీ నాకు ఐటీ రంగమంటే ఎంత ఇష్టమో చెప్పాను. కాదనకుండా ప్రోత్సహించారు. మన ఆశలను సమాధి చేయనవసరంలేదు, స్పష్టంగా చెప్పగలగాలి. అందరికీ ఇలాంటి సహకారమే దొరుకుతుందని నేననను. ఒక్కోసారి మనం కోరుకున్నవి సులువుగా దక్కకపోవచ్చు, కానీ కష్టమైనా చేజిక్కించుకోవాలి. మా అబ్బాయితో నా రోజు మొదలవుతుంది, వాడితోనే ముగుస్తుంది. ఈ రెండిటి మధ్యలో నేను చేయాలనుకున్నవన్నీ చేస్తాను. ఎలాంటి స్థితిగతులనయినా మనకు అనుకూలంగా మార్చుకోవాలని నమ్ముతాను.
- రోషిణీ నాడార్ మల్హోత్రా ఛైర్పర్సన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి