
Donne Biriyani: దొన్నె బిర్యానీతో రూ. 10కోట్ల వ్యాపారం!
ఇంట్లో నాయనమ్మ వండిన సంప్రదాయ ‘దొన్నె బిర్యాని’కి ఆధునిక హంగులు అద్దారు.. పాకెట్మనీనే పెట్టుబడిగా పెట్టి అమ్మకాలు మొదలుపెట్టారు. మన బిర్యాని- మన ఆత్మ గౌరవం అంటూ వినూత్నంగా మార్కెట్ చేశారు. ఐదులక్షల పెట్టుబడిని... ఏడాదిలో పదికోట్ల రూపాయల వ్యాపారంగా మార్చారీ అక్కాచెల్లెళ్లు... రమ్య, శ్వేత...
దొన్నె బిర్యాని.. కొన్నేళ్ల క్రితం వరకూ కర్ణాటక సంప్రదాయ వంటకాల్లో ఇదీ ఒకటిగానే చాలామందికి తెలుసు. కానీ ఈ బిర్యానీని ఓ బ్రాండ్‌గా మార్చి, హైదరాబాదీ బిర్యానీతో పోటీపడేట్టు చేసిన గొప్పతనం మాత్రం రమ్య, శ్వేతలదే. ‘బెంగళూరులో హైదరాబాద్ బిర్యానికి మంచి క్రేజ్. కానీ కర్ణాటక ప్రత్యేకమైన దొన్నె బిర్యానికి మాత్రం ఓ బ్రాండ్ లేదు. మా తాతయ్య రామస్వామి, నాన్న రవిచంద్రన్‌లు నిర్వహించిన హోటళ్లలోనూ దీనికి అంత ఆదరణ రాలేదు. లోపం ఎక్కడుందో మేం గుర్తించాం. మా నాయనమ్మ ఈ వంటకాన్ని అద్భుతంగా చేస్తుంది. ఎప్పటికైనా ఆమె చేతి వంటను ఓ బ్రాండ్‌గా మార్చాలని మనసులో ఉండేది. నేను మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను. శ్వేత ఫైనాన్స్‌లో చేసింది. కొన్ని రోజులు మా కుటుంబం నిర్వహించే హోటళ్లలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశాం. కానీ మాకంటూ ఓ బ్రాండ్ ఉండాలనీ అది మా ఇంటి వంటతోనే ప్రారంభం కావాలనుకున్నామంటోంది రమ్య.
క్లౌడ్ కిచెన్‌తో మొదలుపెట్టి...
‘మా ఆలోచనని ఆచరణలో పెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశాం. లాక్డౌన్ అప్పుడు ఎవ్వరూ హోటళ్లకు వెళ్లలేని పరిస్థితి. ఇంట్లోనే ఉంటూ శుభ్రమైన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మా వ్యాపారానికి అదే సరైన సమయమని భావించాం. తాతయ్య రామస్వామి, నాన్న రవిచంద్రన్‌ల పేరులోని మొదటి అక్షరాలతో ఆర్ఎన్ఆర్ పేరిట బిర్యాని తయారీ మొదలు పెట్టాం. డైన్-ఇన్ హోటల్ ప్రారంభించటం కరోనా నిబంధనల రీత్యా కుదరని పని. పైగా బోలెడంత ఖర్చు. ఆ పరిమితుల నుంచే క్లౌడ్ కిచెన్‌కు శ్రీకారం చుట్టాం’ అంటోంది శ్వేత.
తొలిరోజే వంద ఆర్డర్లు...
బెంగళూరులో... నమ్మ మెట్రో, నమ్మ బెంగళూరు వంటి ట్యాగ్లైన్లతో ఎన్నో బ్రాండ్లు ప్రజలకు చేరువవుతున్నాయి. దాన్నే తమ బిర్యాని ప్రచారానికీ వాడుకున్నారీ అక్కాచెల్లెళ్లు. ‘మా నాయనమ్మ చేసే పద్ధతిలోనే వండి ‘ఆర్ఎన్ఆర్ బిర్యాని-నమ్మ బిర్యాని’ పేరిట 2020 నవంబరు 10న క్లౌడ్ కిచెన్ ప్రారంభించాం. మేమిద్దరం పొదుపుచేసిన రూ.5లక్షల పాకెట్ మనీతో ఈ కిచెన్ మొదలైంది. ఒక చెఫ్‌కు మా నాయనమ్మ చేసే బిర్యానిలో ఉండే ప్రత్యేక పదార్థాలను వివరించి, అదే రుచితో వచ్చేటట్టుగా 50 ఆర్డర్లు తయారు చేయించాం. స్విగ్గీ యాప్‌లో ఆర్డర్ కోసం ఉంచాం. ఉదయం 11గంటలకు తొలి ఆర్డర్ ప్లేస్ కాగా, మధ్యాహ్నానికే 50ఆర్డర్లు అయిపోయాయి. సాయంత్రానికి మరో వంద ఆర్డర్లు రావటంతో ఎగిరి గంతేశాం. అలా మొదలైన మా బిర్యానీ ప్రస్థానం నెల తిరిగేసరికి 10వేల ఆర్డర్లకు చేరుకుంది’ అంటున్నారీ అక్కాచెల్లెళ్లు.
బిర్యాని ఓ అనుబంధం
‘డిజిటల్ మీడియా యుగంలో ప్రచారం ఓ సవాలే. మా ఉత్పత్తి ప్రత్యేకతలివి. ఓసారి కొని చూడండి అనే సాధారణ ప్రచార పదాలకు దూరంగా ఉండాలనుకున్నాం. ఇది మన బిర్యాని అంటూ వినియోగదారుల మనసుల్లోకి తీసుకెళ్లాం. వినూత్నంగా ఆలోచించి సామాజిక మాధ్యమంలో మేం పెట్టిన వైవిధ్యమైన పోస్టింగ్‌లకు విపరీతమైన ప్రచారం వచ్చింది. అసలు ఆహారానికి మించి మీ ప్రచారం అద్భుతం అంటూ ఎంతోమంది మమ్మల్ని ప్రశంసించారు. అందుకే వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా.. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ఇచ్చే సాధారణ పద్ధతిలో కాకుండా మేం భిన్నమైన ప్యాకింగ్‌ని ఎంచుకున్నాం. నీలి రంగులో ఉండే త్రిభుజాకార ప్యాకింగ్ అందించేవాళ్లం. బిర్యానీ, సాలన్, రైతా, ఓ స్వీట్‌ను సింగిల్ ఆర్డర్లో చూడముచ్చటగా ఉండేలా, చూడగానే ఆహారప్రియులకు నచ్చేలా వాటిని ప్యాకింగ్ చేశాం. మేం చేసిన త్రిభుజాకార ప్యాకింగ్ మంచి ట్రెండ్‌ను సృష్టించింది. తొలి రోజు 4 మెయిన్ కోర్సులను ప్రారంభించిన మేము ఏడాదిలోనే వాటి సంఖ్యను 70కి చేర్చాం. మా టర్నోవర్ నేటికి రూ.10కోట్లకు చేరుకుంది. ఏడాదిలో బెంగళూరులో 14క్లౌడ్ కిచెన్లు ప్రారంభించాం. ఇటీవలే ఓ డైన్-ఇన్ హోటల్నీ మొదలుపెట్టాం. దక్షిణ భారత స్థాయిలో నమ్మ దొన్నె బిర్యానికి ప్రత్యేక బ్రాండ్ కల్పించాలన్నది మా లక్ష్యం’ అంటున్నారీ అక్కాచెల్లెళ్లు.
మా ఉత్పత్తి ప్రత్యేకతలివి. ఓసారి కొని చూడండి అనే సాధారణ ప్రచార పదాలకు దూరంగా ఉండాలనుకున్నాం. ఇది మన బిర్యాని అంటూ వినియోగదారుల మనసుల్లోకి తీసుకెళ్లాం. వినూత్నంగా ఆలోచించి సామాజిక మాధ్యమంలో మేం పెట్టిన వైవిధ్యమైన పోస్టింగ్‌లకు విపరీతమైన ప్రచారం వచ్చింది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ఇయాన్ హీలీ ‘పిచ్’ వ్యాఖ్యలకు జాన్ రైట్ కౌంటర్..
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు