భూమిని పోలిన గ్రహం

వాషింగ్టన్‌: భూమి లాంటి మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌరకుటుంబం వెలుపల తిరుగుతున్న ఈ గ్రహం మనకు 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తెలిపారు. హవాయిలోని సుబారు టెలిస్కోప్‌లోని పరారుణ స్పెక్ట్రోగ్రాఫ్‌ ఐఆర్‌డీతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఎరుపు మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోంది. ఇది మాతృతార సమీపంలోని ‘నివాసయోగ్య’ ప్రాంతంలో పరిభ్రమిస్తోంది. అక్కడ సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అందువల్ల ఆ ప్రాంతంలోని గ్రహాల్లో జీవుల మనుగడకు ఆస్కారం ఉంటుంది. భూమి ద్రవ్యరాశితో పోల్చితే నాలుగు రెట్ల అధిక ద్రవ్యరాశి గల ఈ గ్రహానికి రోస్‌-508బిగా పేరుపెట్టారు. దీని ఉపరితలంపై నీరు ఉండే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts