Crime News: తల్లిదండ్రుల అమానుషం.. ఆడపిల్ల అని పాతిపెట్టేశారు!

ల్లిదండ్రులు అన్న మాటకే మాయనిమచ్చలా వ్యవహరించారు ఆ భార్యాభర్తలు. పుట్టింది ఆడపిల్ల అని తెలిసి ఆ పసికందును అమానుషంగా భూమిలో పాతిపెట్టేసి వెళ్లిపోయారు. అదే సమయంలో అటువైపు వెళ్లిన ఓ రైతు ఇది గమనించి ఆ బిడ్డను బయటకు తీసి కాపాడారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గుజరాత్‌లోని గంభోయ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి తండ్రి శైలేశ్‌, తల్లి మంజును అరెస్ట్‌ చేశారు. నిందితులు గాంధీనగర్‌కు చెందినవారు. శిశువు బొడ్డు కూడా ఇంకా ఊడలేదు. మానవతావాదులను కలచివేసే ఈ ఘటన పట్ల పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని