చందమామ రేసులో దక్షిణ కొరియా

తొలి వ్యోమనౌక ప్రయోగం

కేప్‌ కెనావెరాల్‌: చందమామ దిశగా దేశాలు వరుసకడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణ కొరియా చేరింది. జాబిల్లి కక్ష్యలోకి ఒక ఆర్బిటర్‌ను పంపింది. భవిష్యత్‌లో చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌకలను దించడానికి అనువైన ప్రదేశాలను ఇది గుర్తిస్తుంది. ‘దనురి’ అనే ఈ ఆర్బిటర్‌ను స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన రాకెట్‌ ద్వారా అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ప్రయోగించారు. ఇది డిసెంబరులో జాబిల్లిని చేరుతుంది. 18 కోట్ల డాలర్లతో దక్షిణ కొరియా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దనురి.. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుతుంది. ఏడాది పాటు చందమామను శోధిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ కొరియా.. ఈ ఏడాది జూన్‌లో సొంత రాకెట్‌తో భూ కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రుడిని భారత్‌, అమెరికా, చైనాల వ్యోమనౌకలు శోధిస్తున్నాయి. త్వరలో రష్యా, జపాన్‌, అమెరికాలోని పలు ప్రైవేటు కంపెనీలు మరికొన్ని ఉపగ్రహాలను అక్కడికి పంపబోతున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని