క్రికెటర్‌ సురేశ్‌ రైనా, దర్శకుడు శంకర్‌లకు గౌరవ డాక్టరేట్‌

చెన్నై, న్యూస్‌టుడే: క్రికెటర్‌ సురేశ్‌ రైనా, సినీ దర్శకుడు శంకర్‌లను చెన్నైలోని వేల్స్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లతో సత్కరించింది. పల్లావరంలోని వేల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ అడ్వాన్స్డ్‌ స్టడీస్‌ 12వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో సురేశ్‌ రైనా, శంకర్‌లకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా అభిమానులతో సురేశ్‌ రైనా పంచుకున్నారు. ‘‘ప్రతిష్ఠాత్మక వేల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపిన ప్రేమ, అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చెన్నై నాకు ఇల్లు వంటిది. ఇది నాకు చాలా ప్రత్యేకం’’ అని రైనా పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని