Maharashtra: మహారాష్ట్రలో ‘మేమిద్దరం.. మాకిద్దరు’ సర్కారు

ప్రియాంకా చతుర్వేది

హారాష్ట్రలో ప్రభుత్వం మారి నెలదాటిపోయింది. కానీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తప్ప ఇప్పటికీ మంత్రివర్గం లేదు. రాష్ట్ర ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మంత్రులే లేరు. ఇది ‘మేమిద్దరం మాకిద్దరు’ విధానంలో కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న సర్కారు.      


దయాగుణంతోనే మనశ్శాంతి

దలైలామా

మీరు మతాన్ని విశ్వసించినా, విశ్వసించకపోయినా సమస్య లేదు. కానీ సాటి మనుషులపై దయను చూపడాన్ని మాత్రం మర్చిపోకండి. మనశ్శాంతిని పొందడానికి దయాగుణం ఎంత ముఖ్యమో అప్పుడే మీకు తెలిసొస్తుంది. కరుణతో చేసే ఒక్క చిన్న పనైనా మన జీవితాలకు అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేస్తుంది.


ఓటర్ల అంగీకారం లేకుండా ఆధార్‌ అనుసంధానమా?

సీతారాం ఏచూరి

టర్లకు సమాచారం ఇవ్వకుండానే ఇప్పటికే 31 కోట్ల ఓటర్‌ ఐడీలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఆ డేటాను తక్షణం తొలగించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ఆధార్‌తో అనుంధానం స్వచ్ఛందమే తప్ప నిర్బంధం కాదని చట్టం స్పష్టంగా పేర్కొంది. అలా చేయకపోవడం ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన ఈ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది.


అలా ఉండే జీవితం అద్భుతం
హర్ష్‌ గోయెంకా

విషయంపైనా పెద్దగా ఆందోళన చెందకుండా తేలిగ్గా తీసుకునే మనసు ఉంటే, ఎవ్వరినీ నొప్పించక తానొవ్వక మెలిగే హృదయం ఉంటే, ఇతరులతో మర్యాదపూర్వకంగా నడుచుకునే స్వభావముంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది! ప్రస్తుత పోటీ ప్రపంచంలో, ఒత్తిడితో కూడిన జీవితాలలో ఇలా ఉండటం చాలా అవసరం.  


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని