అఫ్గానిస్థాన్‌లో నలుగురు ఉగ్రవాద కమాండర్లు హతం

ఇస్లామాబాద్‌: తెహ్రీక్‌ ఎ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కు చెందిన అగ్రస్థాయి కమాండర్‌ ఒమర్‌ ఖలీద్‌ ఖొరసని, మరో ముగ్గురు కమాండర్లు ఆదివారం అఫ్గానిస్థాన్‌లో హతమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం కింద మందుపాతర పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పాకిస్థాన్‌ మీడియా సోమవారం వెల్లడించింది. ఉగ్రముఠా నేతలతో భేటీ అనంతరం తిరిగి వస్తుండగా బిర్మల్‌ జిల్లాలో రోడ్డుపై అమర్చిన శక్తిమంతమైన మందుపాతర పేలిందని పేర్కొంది. ఈ ఘటనలో ఒమర్‌ ఖలీద్‌తో పాటు అబ్దుల్‌ వలి మొహ్మద్‌, ముఫ్తీ హసన్‌, హఫీజ్‌ దవ్లాత్‌ ఖాన్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు బాధ్యులెవరన్నది తెలియరాలేదు.


మరిన్ని

ap-districts
ts-districts