Donald Trump: ఫ్లోరిడాలోని ట్రంప్‌ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (76)కు చెందిన ఫ్లోరిడా ఎస్టేటుపై ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) అధికారులు దాడులు నిర్వహించారు. అధ్యక్ష కార్యాలయ దస్తావేజుల అప్పగింతకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి. తన ఇంటిని ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తదుపరి ఎన్నికలకు 2024లో శ్వేతసౌధం వైపు తాను కన్నెత్తి చూడకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమే ఈ దాడులని మండిపడ్డారు. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో ఉన్న మార్‌-ఎ-లాగో నివాసంపై జరిపిన ఈ సోదాల విషయాన్ని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. ‘ఇవి దేశానికి చీకటి రోజులు. నా ఇంటిని ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారు. గతంలో ఏ అధ్యక్షుడి విషయంలోనూ ఇలా జరగలేదు’ అంటూ ఓ సుదీర్ఘ ప్రకటనను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  అట్లాంటిక్‌ సముద్రతీరంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎస్టేటు ఉంది. 2021 జనవరిలో శ్వేతసౌధాన్ని ఖాళీ చేసిన సందర్భంగా ట్రంప్‌ ఏవైనా రహస్య పత్రాలను తన వెంట తీసుకెళ్లారా? అన్న విషయంపై అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని