ఇజ్రాయెల్‌ దాడుల్లో ముగ్గురు పాలస్తీనా పౌరుల మృతి

జెరూసలెం: మూడు రోజుల పాటు అమలైన కాల్పుల విరమణ ముగిసిపోవడంతో ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరిపి తమ దేశానికి చెందిన ముగ్గురు పౌరుల ప్రాణాలను బలి తీసుకున్నాయని పాలస్తీనా ఆరోపించింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారని తెలిపింది. ఇజ్రాయెల్‌ ఈ వాదనను తోసిపుచ్చింది. పేలుడు పదార్థాలతో పాలస్తీనా బలగాలే తమపై విరుచుకుపడ్డాయనీ, దానిని సైనికులు తిప్పికొట్టారని తెలిపింది. కాల్పులకు గురైనవారి పరిస్థితి ఏమిటనేది మాత్రం చెప్పలేదు. గాజాస్ట్రిప్‌ వద్ద పోరాటంలో గత మూడు రోజుల్లో కనీసం 46 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారనీ, వీరిలో 16 మంది పిల్లలు ఉన్నారని పాలస్తీనా తెలిపింది.


మరిన్ని

ap-districts
ts-districts