తప్పుడు వాగ్దానాల కంటే ఓడిపోవడమే మేలు: సునాక్‌

లండన్‌: ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు తప్పుడు వాగ్దానాలివ్వడం కంటే ఎన్నికల్లో ఓడిపోవడమే మేలు అని బ్రిటన్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ అన్నారు. జీవన వ్యయాలు భారీగా పెరిగిన ప్రస్తుత తరుణంలో అత్యంత దుర్బల కుటుంబాలను ఆదుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్రిటన్‌ ప్రధాని పదవికి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ పోటీపడుతున్న విషయం తెలిసిందే. తాను గెలిస్తే పన్నులను తగ్గిస్తానని ట్రస్‌ హామీ ఇవ్వగా.. దానివల్ల ధనవంతులకే ప్రయోజనమని సునాక్‌ తిప్పికొట్టారు. ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం తన ప్రాధాన్యం కాదని ఆయన స్పష్టంచేశారు. ద్రవ్యోల్బణం, ప్రధానంగా విద్యుత్‌ బిల్లుల గురించి లక్షల మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారని, తాను ప్రధానిగా ఎన్నికైతే వారిని ఆదుకోవడంలో ముందుంటానని పేర్కొన్నారు. ‘ఈ గడ్డు పరిస్థితుల్లో ప్రజలకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. ప్రజల డబ్బు తీసుకోకుండా ఉండేందుకే నేను ప్రాధాన్యమిస్తాను. ప్రధానమంత్రిగా ఎన్నికైతే.. ఇప్పటికే చెప్పినవాటికంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటాను’ అని హామీ ఇచ్చారు.


మరిన్ని

ap-districts
ts-districts