చీతాల పరిరక్షణకు ఎన్‌టీసీఏతో ఐవోసీ ఒప్పందం

దిల్లీ: చీతాలను నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తరలించి సంరక్షించేందుకు ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐవోసీ) ముందుకు వచ్చింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ)తో ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఇటీవల సంతకం చేసింది. ఐదేళ్ల కాలంలో రూ.50.22 కోట్లను ఇండియన్‌ ఆయిల్‌ ఖర్చు చేయనుంది. 15-20 చీతాలను తీసుకురావడం, వాటి ఆవాస ప్రాంతాల పరిరక్షణ, సిబ్బందికి శిక్షణ వంటివాటికి ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని ఐవోసీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఈడీ డాక్టర్‌ భట్టాచార్య తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద దీనిని చేపట్టిన తొలి కార్పొరేట్‌ సంస్థగా ఐవోసీ నిలిచిందని చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts