లంక అధ్యక్షుడి అధికారాలపై వేటుకు బిల్లు

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడి అధికారాలను కత్తిరించే 22వ రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను న్యాయశాఖ మంత్రి విజయేంద్ర రాజపక్స పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానమంత్రినీ, మంత్రివర్గాన్నీ తొలగించడానికి అధ్యక్షుడికి ఉన్న విశేష అధికారాన్ని ఈ సవరణ రద్దు చేస్తుంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారాలు కేంద్రీకృతం కాకుండా జాగ్రత్త తీసుకోవడం అన్న మాట. దేశం ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయినప్పటి నుంచీ ఉద్యమపథం చేపట్టిన ప్రజాస్వామ్యవాదుల ప్రధాన డిమాండు కూడా ఇదే. వారు కోరిన మేరకు సవరణ బిల్లులో అవినీతి నిరోధక నిబంధనలనూ పొందుపరిచారు.  

బ్యాంకాక్‌ చేరుకొన్న గొటబాయ

శ్రీలంక నుంచి మొదట మాల్దీవులకు, తరవాత సింగపూర్‌కు పరారైన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు సింగపూర్‌ ఇచ్చిన తాత్కాలిక వీసా గడువు గురువారంతో తీరిపోయింది. దీంతో ఆయన సింగపూర్‌ నుంచి థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts