చైనాకు మళ్లీ షాక్‌.. తైవాన్‌లో మరో అమెరికా బృందం

తైపీ: చైనా, తైవాన్‌ వివాదం మరోమారు చర్చనీయాంశమైంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బృందం పర్యటన రాజేసిన అగ్గి ఇంకా చల్లారకముందే.. అయిదుగురు అమెరికా చట్టసభ సభ్యుల మరో బృందం   తైవాన్‌ పర్యటనకు వచ్చింది. ఆసియా పర్యటనలో ఉన్న సేన్‌.ఎడ్‌ మార్కీ నేతృత్వంలోని ఈ బృందం ప్రస్తుతం తైవాన్‌లో ఉంది. తైపీలోని అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ బృందం తైవాన్‌ ఉన్నతాధికారులను కలిసి.. అమెరికా - తైవాన్‌ సంబంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇతర అంశాలపై చర్చిస్తుందని తెలిపింది.


మరిన్ని

ap-districts
ts-districts