పాక్‌ నౌకతో యుద్ధ విన్యాసాలు అబద్ధం: శ్రీలంక

కొలంబో: పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌకతో తాము కొలంబో నౌకాశ్రయంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నామంటూ వచ్చిన వార్తలను శ్రీలంక ఖండించింది. వాటిని అసత్య వార్తలుగా పేర్కొంది.  ప్రస్తుతం శ్రీలంక జలాల్లో ఉన్న పాక్‌ నౌక పీఎన్‌ఎస్‌ తైమూర్‌ ఆ దేశానికి వెళ్తున్న సమయంలో సోమవారం లాంఛనంగా విన్యాసాలు(పాసేజ్‌ ఎక్సర్‌సైజ్‌) నిర్వహించనున్నట్లు తెలిపింది. చైనా తయారు చేసిన ఈ కొత్త నౌక పాక్‌కు వెళ్లే క్రమంలో శుక్రవారం కొలంబో పోర్టులో ఆగింది. అంతకు ముందు ఈనౌక చత్తోగ్రామ్‌ పోర్టులో ఆగడానికి బంగ్లాదేశ్‌ అనుమతి నిరాకరించింది. చైనాకు చెందిన అధునాతన నౌక ఒకటి శ్రీలంకకు వస్తుండటంపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో.. పాక్‌ నౌక కూడా ఆ దేశానికి రావడం చర్చనీయాంశం అయింది. యుద్ధ విన్యాసాల కోసమే ఈ నౌక వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీన్ని శ్రీలంక తాజాగా ఖండించింది.


మరిన్ని

ap-districts
ts-districts