పాల ధరను మళ్లీ పెంచిన అమూల్‌, మదర్‌ డెయిరీలు

దిల్లీ: పాలధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్‌, మదర్‌ డెయిరీలు ప్రకటించాయి. ఈ డెయిరీలు పాలధర పెంచడం గత ఆర్నెల్లలో ఇది రెండోసారి. మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున పెంచాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని అమూల్‌ ఉత్పత్తి సంస్థ ‘ది గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌’ తెలిపింది. లీటరు పాల గరిష్ఠ ధర 4 శాతం పెంచామని.. ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణంతో పోల్చితే తక్కువేనని పేర్కొంది.


మరిన్ని

ap-districts
ts-districts