సైనికుడైన తండ్రికి వేణుగానంతో చిన్నారి నివాళి

దేశమంతా స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాకు చెందిన హనీ అనే బాలిక సైనికుడిగా పనిచేసిన తండ్రి సమాధి ముందు వేణువుతో జాతీయగీతం ఆలపించింది. గౌడహళ్లి గ్రామవాసి, విశ్రాంత సైనికుడైన నవీన్‌ ఓ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచీ ఆయన కుటుంబం ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నివాళులర్పిస్తోంది. సోమవారం నవీన్‌ సమాధి ముందు హనీ వేణువుతో జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అంజలి ఘటించింది.


మరిన్ని

ap-districts
ts-districts