అవినీతి నిరోధక ఉద్యోగులకు సీవీసీ సత్కారం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతికి అడ్డుకట్ట వేయడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, ఉద్యోగులను సత్కరించాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) నిర్ణయించింది. ‘విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ నేపథ్యంలో ఈ నామినేషన్లను ఆహ్వానించారు. విధుల నిర్వహణలో ఇతర ఉద్యోగులూ అప్రమత్తంగా ఉండేలా ప్రేరణ కల్పించేందుగ్గాను ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది కాలంలో అన్ని విభాగాల్లో అవినీతిని అడ్డుకునేందుకు అధికారులు, ఉద్యోగులు చేపట్టిన నిర్దిష్ట చర్యలను గుర్తించాలని ముఖ్య నిఘా అధికారులందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాంటి అధికారులు, సిబ్బంది పేర్లను ఆయా సంస్థల సీఈవోల ఆమోదంతో తమకు పంపాలని కోరారు.


మరిన్ని

ap-districts
ts-districts