
Costliest Dog: ఈ శునకం.. ఖరీదులో ‘కనకం’.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
శివమొగ్గ, న్యూస్‌టుడే: దసరా వేడుకల్లో భాగంగా కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం రాష్ట్ర స్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శన జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు పోటీల్లో పాల్గొన్నారు. 22 జాతుల శునకాలతో వాటి యజమానులు వచ్చారు. బెంగళూరుకు చెందిన వ్యాపారి, జాగిలాల ప్రియుడు ‘కడబం’ సతీశ్ తీసుకొచ్చిన టిబెటియన్ మస్టిఫ్ జాతి జాగిలం ‘భీమ’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.10 కోట్లు ఖర్చు చేసి, గత ఏడాది చైనాలోని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో భీమను తెప్పించినట్లు ఆయన చెప్పారు. ఈ జాగిలంతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. భీమ కోసం ఏసీ గది సదుపాయాలతో పాటు ఆహారానికి నెలకు రూ.25 వేలు ఖర్చు చేస్తున్నట్లు సతీశ్ తెలిపారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు