
అమ్మో ఇంత దంతమా.. వ్యక్తి నోట్లో 37.5 మిల్లీమీటర్ల పన్ను!
జమ్మూ-కశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నోట్లో నుంచి వైద్యులు ‘భారీ పన్ను’ను బయటకు తీశారు. 37.5 మిల్లీమీటర్ల పొడవు ఉన్న ఈ దంతం ప్రపంచంలోనే అతి పెద్ద దంతం కావొచ్చని చెబుతున్నారు. ఎస్డీహెచ్ బీడ్‌వా ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి నోటి నుంచి ఈ పన్నును బయటకు తీశామని వైద్యుడు జావైద్ అహ్మద్ వెల్లడించారు. 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రికి వచ్చాడని, అతడికి ఎక్స్‌రే తీయగా.. దంతం చాలా పెద్దగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. బాధితుడి అనుమతితో శనివారం గంటన్నరసేపు శస్త్రచికిత్స నిర్వహించి ఆ దంతాన్ని బయటకు తీశామని చెప్పారు. గిన్నిస్ పుస్తకంలో నమోదైన రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పన్ను సైజు 37.2 మిల్లీమీటర్లు. ప్రస్తుతం బయటకు తీసిన పన్ను అంతకంటే పొడవుగా ఉంది. అందువల్ల ఈ పన్ను గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించుకునే అవకాశముంది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు