
దుర్గమ్మ తెచ్చే కాసుల పంట.. పశ్చిమబెంగాల్లో దసరా వ్యాపారం ఎంతో తెలుసా?
కోల్‌కతా: భక్తిశ్రద్ధలు, సంతోష, సంబరాలతో సాగే దసరా వేడుకలు పశ్చిమబెంగాల్లో రూ.40 వేల కోట్ల వ్యాపారానికి వేదికయ్యాయి. అంతేకాదు ఏకంగా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఫోరమ్ ఫర్ దుర్గాస్తాబ్(ఎఫ్ఎఫ్డీ) ఛైర్మన్ పార్థో ఘోష్ సోమవారం వెల్లడించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 వేల దుర్గా మండపాలను ఏర్పాటు చేశారు. ఒక్క కోల్‌కతాలోనే ఇవి మూడు వేలున్నాయి. వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి’ అని ఆయన వివరించారు. ‘‘ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు భాగస్వాములవుతారు. ముఖ్యంగా మండపాలు నిర్మాణదారులు, విగ్రహాల రూపకర్తలు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వాద్యకారులు, కూలీలు, కేటరింగ్ సేవలందించేవారు ఉంటారు’’అని ఘోష్ తెలిపారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ ఆల్‌టైమ్ ‘XI’.. కెప్టెన్సీపై చర్చ.. ఓజా ఎంపిక ఎవరంటే?
-
Politics News
Krishna: వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు