న్యాయస్థానంపై నమ్మకం ఉంది: గాలి జనార్దన్‌రెడ్డి

బళ్లారి, న్యూస్‌టుడే: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరగా విచారించాలని న్యాయస్థానంలో దరఖాస్తు సమర్పించినట్లు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం బళ్లారి కనక దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉంది. 12 ఏళ్లుగా బయట కనిపించడం లేదు. కుటుంబం, దేవుని ధ్యానంలో జీవనం సాగిస్తున్నాను. నేను బళ్లారిలో ఉండకూడదని కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో 14నెలలుగా బళ్లారిలోనే ఉంటున్నాను. బళ్లారిలో ఉండకూడదని న్యాయస్థానంలో సీబీఐదరఖాస్తు సమర్పించింది. త్వరలో మీ ముందుకు వస్తాను’ అని వ్యాఖ్యానించారు.


మరిన్ని