నేపాల్‌ ఎన్నికల్లో పాలక సంకీర్ణం ఆధిక్యం

భారీ మెజారిటీతో గెలిచిన ప్రధాని దేవ్‌బా

కాఠ్‌మాండూ: నేపాల్‌ పార్లమెంటు దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభకు ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవ్‌బా(77) భారీ మెజారిటీతో గెలిచారు. గడచిన ఏడు ఎన్నికల్లో దేవ్‌బా వరుసగా విజయాలు సాధించారు. ప్రస్తుతం అయిదోసారి ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తున్నారు. పార్లమెంటు దిగువ సభతోపాటు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పాలక నేపాలీ కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలైన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (సీపీఎన్‌)-మావోయిస్ట్‌, సీపీఎన్‌-యునైటెడ్‌ సోషలిస్ట్‌, లోక్‌తాంత్రిక్‌ సమాజ్‌వాదీ పార్టీలు 81 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. సీపీఎన్‌-యూఎంఎల్‌, దాని మిత్రపక్షాలైన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనతా సమాజ్‌వాదీ పార్టీలు 55 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. 275 సీట్లు గల నేపాల్‌ పార్లమెంటులో 165 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మిగతా 110 సీట్లకు దామాషా పద్ధతిపై సభ్యుల ఎన్నిక జరుగుతుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని