సిరియాపై దాడులు చేస్తాం

తుర్కియే హెచ్చరిక

తుర్కియే: ఇస్తాంబుల్‌లో ఈ నెల 13న జరిగిన బాంబు పేలుడుకు ప్రతీకారంగా ఉత్తర సిరియాలోని కుర్దు ప్రాంతాలపై దాడులు చేస్తామని తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ బుధవారం హెచ్చరించారు. తుర్కియే ఇప్పటికే సిరియా, ఇరాక్‌లలోని కుర్దు ప్రాంతాలపై విమానాలతో దాడులు నిర్వహించింది. భూతల దాడులు జరపొద్దని రష్యా కోరుతున్నప్పటికీ విమాన దాడులు కేవలం ఆరంభమని.. సరైన సమయంలో ఉత్తర సిరియాలోని కుర్దు తీవ్రవాదుల స్థావరాలపై భూతల దాడి నిర్వహిస్తామని ఎర్డోగాన్‌ ప్రకటించారు. తుర్కియే 2016 నుంచి సిరియా సరిహద్దులను దాటి వెళ్లి దాడులు జరిపింది. ఇస్తాంబుల్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడుతో తమకు సంబంధం లేదని.. తుర్కియే కనుక దాడికి దిగితే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని కుర్దుల నాయకత్వంలోని సిరియా రక్షణ దళాలకమాండర్‌ మజ్లూం అబ్ది ప్రకటించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని