మా సహనం అంతులేనిదేమీ కాదు

సైన్యంపై దుష్ప్రచారాన్ని ఉపేక్షించం
పాక్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ బజ్వా వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సైన్యం ప్రతిష్ఠను మంటగలపడమే లక్ష్యంగా కొందరు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ ఆ దేశ సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా మండిపడ్డారు. దాన్ని వెంటనే నిలిపివేయాలని హితవు పలికారు. దుష్ప్రచారం విషయంలో తాము కొన్నాళ్లుగా చాలా ఓపికతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. అయితే తమ సహనమేమీ అపరిమితమైనది కాదని హెచ్చరించారు. రాజకీయ నాయకులు అహాన్ని పక్కనపెట్టాలని, గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న బజ్వా.. రావల్పిండిలో బుధవారం పాక్‌ రక్షణ, అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తాను మరోసారి పదవీకాలం పొడిగింపును కోరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పాక్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విదేశీ కుట్ర జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను బజ్వా తోసిపుచ్చారు. అలాంటి పన్నాగం ఏదైనా ఉండి ఉంటే.. సైన్యం చూస్తూ ఉండేది కాదన్నారు. సైన్యం కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవేనని ఆయన అంగీకరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని