యూరోపియన్‌ పార్లమెంటు వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి!

మాస్కో అనుకూల గ్రూపు దుశ్చర్య
రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా పేర్కొన్నందునే?

బ్రసెల్స్‌: యూరోపియన్‌ పార్లమెంటు వెబ్‌సైట్‌ సైబర్‌ దాడికి గురైంది! ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా రష్యాను పేర్కొంటూ తీర్మానం చేసిన క్రమంలో... మాస్కో అనుకూల గ్రూపు ఒకటి ఈ దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను పార్లమెంటు ప్రెసిడెంట్‌ రాబర్టా మెత్సోలా బుధవారం వెల్లడించారు. యూరోపియన్‌ పార్లమెంటు వెబ్‌సైట్‌ సైబర్‌ దాడికి గురైందని, తామే ఈ దాడికి పాల్పడినట్టు క్రెమ్లిన్‌ అనుకూల గ్రూపు వెల్లడించిందని తెలిపారు. ‘‘దుండగులు జంక్‌ డేటాను చొప్పించడం ద్వారా వెబ్‌సైట్‌ సేవలకు అంతరాయం కలిగించారు. సమాచారం, సేవలు అందకుండా చేశారు. నెట్‌వర్క్‌ మాత్రం సురక్షితంగా ఉంది. దాని జోలికి వారు రాలేరు. మా వ్యవస్థల పరిరక్షణకు ఈయూ ఐటీ నిపుణులు రంగంలోకి దిగారు’’ అని ఆమె వెల్లడించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని