సంక్షిప్త వార్తలు(2)

కాగ్‌ నివేదికల్లోని అంశాల పరిశీలనకు మూడు ఉపసంఘాలు

ఈనాడు, దిల్లీ: కాగ్‌ నివేదికల్లోని వివిధ అంశాలపై పరిశీలన జరిపి పార్లమెంటుకు నివేదికలు సమర్పించడానికి వీలుగా ప్రజా పద్దుల కమిటీ మూడు ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. ఈ మూడింటికీ ఛైర్మన్‌గా అధిర్‌రంజన్‌ చౌదరి వ్యవహరించనుండగా, కన్వీనర్లుగా కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్‌ గోహిల్‌, భాజపా సభ్యుడు సత్యపాల్‌సింగ్‌, ఏఐడీఎంకె సభ్యుడు ఎం.తంబిదురై ఉంటారు. ఒక ఉపసంఘం సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ప్రోత్సాహం, నగదు నిర్వహణలో లోపాలు, ప్రభుత్వ ఖాతాల వెలుపల అక్రమంగా నిధులను దాచిపెట్టడం, ప్రావిడెంట్‌ ఫండ్‌కు ఉద్యోగుల అధిక చందా, విద్యుత్తు ఛార్జీల్లో పరిహరించదగ్గ చెల్లింపులు, రైల్వే ఉత్తర్వుల అమలులో వైఫల్యం తదితర అంశాలపై అధ్యయనం చేసింది. ఒక ఉపసంఘంలో ఏపీకి చెందిన వైకాపా సభ్యుడు బాలశౌరి వల్లభనేని, భాజపా సభ్యుడు సీఎం రమేష్‌ సభ్యులుగా నియమితులయ్యారు.


బలవంతపు మతమార్పిడి నిరోధానికి.. చట్ట సవరణపై కేంద్రం మాటేమిటి?

అఫిడవిట్‌ దాఖలుకు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: వ్యక్తులను బెదిరించడం, మోసపూరితంగా కానుకలను ఎర వేయటం ద్వారా మతమార్పిడికి ప్రోత్సహించడాన్ని నిరోధించేలా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లలో సవరణకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజా పిటిషను దాఖలైంది. కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వశాఖలకు కూడా తాను ఇప్పటికే పూర్తి సమాచారంతో ఈ వివరాలు సమర్పించినట్లు పిటిషనరు అశ్విని ఉపాధ్యాయ న్యాయస్థానానికి తెలిపారు. అలాగే మత ప్రబోధకులు, విదేశీ మిషనరీలు, విదేశీ విరాళాలు అందుకొంటున్న ఎన్జీవోలకు సంబంధించిన నియమాలు, వీసా నిబంధనలను కూడా సమీక్షించాలని ఆయన కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది.
మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు