‘నాకు భార్యవి అవుతావా?’.. ఇన్‌స్టాలో బాలుడి స్టేటస్‌

కేసు నమోదు చేసిన పోలీసులు

మహారాష్ట్రలో ఓ పాఠశాల విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టేటస్‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది అతనిపై కేసు నమోదుకు కారణమైంది. పుణెలో ఓ 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి.. తన పాఠశాలలో చదివే 13 ఏళ్ల బాలికను తనతో స్నేహం చేయాలని ఆమె వెంటపడేవాడు. లేదంటే ఎత్తుకు పోతానని బెదిరించాడు. అయినా.. ఆ బాలిక అతడిని పట్టించుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న అతను.. ఆ బాలికను ఫొటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నువ్వు నా భార్యవి అవుతావా?’ అంటూ స్టేటస్‌ పెట్టాడు. దీన్ని చూసిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు