close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తియ్యటి పుల్లటి సలాడ్‌

అమ్మచేత కమ్మగా

కావల్సినవి: యాపిల్‌ - ఒకటి, కమలాఫలం - ఒకటి,  బొప్పాయి - పావు ముక్క, స్ట్రాబెర్రీ - నాలుగు, ఆకుపచ్చ, నలుపురంగు ద్రాక్ష- నాలుగు చొప్పున, నిమ్మరసం - పెద్ద చెంచా, దానిమ్మ గింజలు - అర కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు - అర కప్పు, వేయించిన పల్లీలు - అర కప్పు, పుచ్చకాయ గింజలు - రెండు పెద్ద చెంచాలు, పుదీనా ఆకులు - పదిహేను, ఉప్పు - సరిపడా, తేనె - రెండు పెద్ద చెంచాలు, వెనిగర్‌ - పెద్ద చెంచా.

తయారీ: ముందుగా యాపిల్‌ను శుభ్రంగా కడిగి, తుడిచి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం కలపాలి. దీనివల్ల ఇవి రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు కమలాఫలం తొనలు మొదలు, మిగిలిన పండ్ల  ముక్కలు, దానిమ్మ గింజలను యాపిల్‌ ముక్కలపై వేసుకోవాలి.  ఇందులో వెనిగర్‌ తప్ప వేయించిన పల్లీలు, ఉడికించిన మొక్కజొన్న గింజలతోపాటు మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలపాలి. చివరగా వెనిగర్‌ వేస్తే చాలు. తియ్యటి, పుల్లటి సలాడ్‌ సిద్ధం.


మరిన్ని