close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వృథా వస్తువులనే అందంగా...

ఇంట్లో వాడకుండా ఉండే పాత లేదా వృథా వస్తువులను బయట పడేస్తుంటాం. అలా పర్యావరణ కాలుష్యానికీ కారణమవుతూ ఉంటాం. కాస్తంత సృజనాత్మకంగా ఆలోచిస్తే... వీటితో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటివాటిల్లో ఇస్త్రీ పెట్టె, బ్యాట్‌, నీళ్ల తొట్టె, ప్లాస్టిక్‌ సీసా, చేట, జల్లెడ, పాత కుట్టుమిషన్‌, హ్యాంగర్లు, పాన్‌లు, గరిటెలు, లాంతర్లు ఇలా ఏవైనా ఉండొచ్చు, వాటిపై లేసుతో అల్లేయొచ్చు. లేదా వాటర్‌ కలర్స్‌తో ఇష్టమైన డిజైన్లు వేయొచ్చు. ఇవన్నీ ఇంటికి అదనపు ఆకర్షణను తెస్తాయి. అలాంటివాటిల్లో ఇవి కొన్ని...!

 

 


మరిన్ని