close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
లేచిన వెంటనే ఫోనెందుకు?

దినచర్య ఉత్సాహంగా,  ప్రశాంతంగా ఉండాలంటే... నిద్రలేచిన వెంటనే ఉరుకులు, పరుగులతో జీవితాన్ని మొదలుపెట్టకండి. ఇలా చేసి చూడండి.
* రాత్రంతా శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. లేచిన వెంటనే రోజును హడావుడిగా మొదలుపెట్టడం వల్ల వెన్ను, కండరాలపై ప్రభావం చూపుతుంది. సరిగ్గా లేచే సమయానికి కొన్ని నిమిషాల ముందే  అలారం పెట్టుకొని మేల్కొనండి. కనీసం పదినిమిషాలు స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయండి. కండరాలు పూర్తి స్థాయిలో చురుగ్గా మారిన తరువాత రోజు ప్రారంభించండి. అప్పుడే అన్ని భాగాలకు రక్త ప్రసరణ ఉంటుంది.
* గృహిణులు, ఉద్యోగినులు పనులన్నీ పూర్తయ్యే వరకు అల్పాహారం జోలికి వెళ్లరు. కొందరైతే అసలు తినడమే మానేస్తారు. ఇది సరికాదు. నిద్రపోయినప్పుడు జీవక్రియలు నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులు క్రమంగా తగ్గుతాయి. రోజు సరిగ్గా ప్రారంభం కావడానికి శరీరానికి శక్తి కావాలి. లేచిన 45 నిమిషాల్లోపే గుడ్డు, పండ్లు, పాలు, తృణ ధాన్యాలు, పిడికెడు నట్స్‌ వంటివి తీసుకోవాలి. ఖాళీ కడుపుతోనే రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లు తాగడం మంచిది.
* కొందరు అలారం మోగుతున్నా ఓ పట్టాన లేవరు. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. మరికొందరు లేచిన వెంటనే మెయిళ్లు, ఫోను చూస్తారు. ఇలా సమయాన్ని వృథా చేసుకునే బదులు ఓ అరగంట మానసిక ప్రశాంతతకు కేటాయించుకోండి. నడవడమో, యోగా, శ్వాస వ్యాయామాలో సాధన చేయాలి. వీలైతే పుస్తకాలు చదవండి. ఉదయం ఆనందంగా ప్రారంభిస్తే రోజూ మొత్తం ప్రశాంతంగా గడిచిపోతుంది.


మరిన్ని