close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మనకి రీఛార్జ్‌ అవసరం...!

ఎప్పుడూ ఒకే రకమైన జీవితం విసుగు తెప్పిస్తుంది. ఒక్కోసారి ఆ బంధాల నుంచీ తాత్కాలికంగా ఉపశమనం కావాలనిపిస్తుంది. మరి అలాంటి నిరాశ దరిచేరకూడదంటే...! మిమ్మల్ని మీరు రీఛార్జ్‌ చేసుకోవాల్సిందే. అందుకు మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎలా మొదలుపెట్టాలంటే!

నిద్రపోండి: పని ఒత్తిడి అందరినీ పరుగులు పెట్టిస్తోంది. నిద్రలోనుంచి లేవగానే...పనులు గుర్తొస్తాయి. అది మొదలు తిరిగి రాత్రి నిద్రపోయేవరకూ పరుగులే. ఆ హడావిడి లేకుండా ఉండాలంటే...ముందు మీకు సరిపడినంత నిద్ర కావాలి. అప్పుడే మీరు అనుకున్న సమయానికి లేవగలరు.

వ్యాయామం చేయండి: రోజూ కంటే ఓ అరగంట ముందు లేవడం అలవాటు చేసుకోండి. వెంటనే పనిలోకి దిగకుండా కాసేపు వ్యాయామం చేయండి. ఆరుబయట నాలుగడుగులు వేయండి. అదీ లేదంటే పదినిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానం చేయండి. ఈ పనులన్నీ మీ మెదడుని తేలికపరుస్తాయి. ఉత్సాహంగా పనిచేసే శక్తిని అందిస్తాయి.

పద్ధతి మార్చండి: రోజూ చేసే పనే కానీ... ఎంతకీ తెమలదు. కారణం అలవాటున్న పని అనే నిర్లక్ష్యం కావొచ్ఛు ఈసారి ఎప్పుడూ చేసేలా కాకుండా...! ఇంకేదైనా సులువైన మార్గం ఉందేమో చూడండి. పనిమీద ఏకాగ్రత తప్పకూడదంటే...చేసేదానిలో వైవిధ్యం ఉండాలి. అప్పుడే ఉత్సాహంగా చేయగలుగుతాం.

ప్రణాళిక ఉండాలి: ఏ పని తరువాత ఏం చేయాలో తెలుసు...అందుకే పెద్దగా వాటికోసం ఆలోచించం. కానీ ఒత్తిడి తగ్గించుకోవాలంటే రోజువారీ ప్రణాళిక తప్పనిసరి. అది వంటకైనా, వేసుకునే దుస్తులకైనా...ప్రతిపనికీ ఉండాలన్న ప్రాథమిక సూత్రం కేటాయించుకోండి. అది మీ కళ్లకు కనిపించేలా ఓ ఛార్ట్‌ లేదా స్లిప్స్‌ రూపంలో గోడకు అంటించండి. మీ పనులన్నీ పూర్తయ్యి మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకునే అవకాశం లభిస్తుంది.


మరిన్ని