close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దానిమ్మతో ఒత్తిడి దూరం


రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని చాలామంది సలహా ఇస్తుంటారు. దీనిలో విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ పండు వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో చూద్దామా!
* ఈ పండులో పిండిపదార్థాలు 14% అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు 6%, పీచు 11%, మాంసకృత్తులు 3%, విటమిన్లు 14%, థయామిన్‌ 5.5%, ఐరన్‌ 4% ఉంటాయి. ఇవే కాకుండా యాంటీఆక్సిడెంట్లు, ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లేవిన్‌ మెండుగా ఉంటాయి.
* ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్‌ సమ్మేళనాలు మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లనూ అదుపులో ఉంచుతాయి.
* రోజూ క్రమం తప్పకుండా కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల క్యాన్సర్‌ కారకాలను నియంత్రించొచ్చు.
* దానిమ్మను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి మరింత బలం చేకూరుతుంది. ఇది బ్యాక్టీరియల్‌, వైరల్‌ జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ పండు శరీరంలో మంచి   కొలెస్ట్రాల్‌ ఉత్పత్తిని పెంచుతుంది.
* ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువ మొత్తంలో ఉండే ఈ గింజలను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
* దానిమ్మ తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ క్రమపద్ధతిలో జరుగుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. రక్తం గడ్డ కట్టే సమస్యా దాదాపుగా ఎదురుకాదని అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ దానిమ్మ గింజలు తినాల్సిందే. వీటిని తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు విడుదల కాదు. అల్జీమర్స్‌ వచ్చే అవకాశం తక్కువ.
* ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్‌ యాసిడ్‌ కాబోయే తల్లికే కాదు, పుట్టబోయే బిడ్డకూ ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణులకు కాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.
* రోజూ రెండు కప్పుల దానిమ్మ రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. ఈ గింజలు తినడం వల్ల జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గేందుకూ తోడ్పడుతుంది.


మరిన్ని