close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అత్తగారి ఆస్తి నాకు వస్తుందా!

మా పెళ్లయి మూడేళ్లు అవుతోంది. మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. దాంతో ఐదు నెలల కిందట నా భర్తపై 498ఎ సెక్షన్‌ కింద కేసు పెట్టా. ఇద్దరం ప్రస్తుతం విడిగా ఉంటున్నాం. నేను గర్భవతిని. ఆస్తి అంతా మా అత్తగారి పేరు మీదే ఉంది. అది ఆవిడ స్వార్జితం. విడాకులు తీసుకుంటే దానిపై నాకు హక్కు ఉంటుందా?

- ఓ సోదరి

మీరు మీ వారి మీద 498ఎ సెక్షన్‌ కింద కేసు పెట్టారు. మిమ్మల్ని వేధింపులకు గురిచేసిన మీ భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులకు శిక్షపడటమే దీని ఉద్దేశం. దానికీ విడాకుల తరువాత అత్తింటివారి నుంచి కోరుకునే భరణానికి సంబంధం లేదు. ఆస్తి మీ అత్తగారి పేరు మీద ఉందంటున్నారు. ఆడవారి పేరు మీద ఉన్న ఏ ఆస్తి అయినా...అంటే పుట్టింటివారు ఇచ్చినా, భర్త ఇచ్చినా...సొంతంగా సంపాదించినా అది వారి అబ్సల్యూట్‌ ప్రాపర్టీ అవుతుంది. విడాకులు తీసుకున్నా, తీసుకోకపోయినా ఆవిడ ఆస్తిలో మీకు హక్కు ఉండదు. మీ పరిస్థితులను బట్టి భరణం లేదా పరిహారం రావొచ్ఛు అంటే... విడాకులు లేదా గృహహింస చట్టం కింద పెట్టిన కేసు ద్వారా మీరు పడ్డ ఇబ్బందులు, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిహారం అడగొచ్ఛు దాన్ని కోర్టు అంగీకరించి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇస్తే... భర్త అత్తగారి పేరు మీద ఏమైనా ఉమ్మడి ఆస్తులుంటే వాటి అటాచ్‌మెంట్‌ అడగవచ్ఛు ఆస్తి మీద హక్కులు మాత్రం మీకు రాకపోవచ్ఛు

మీ ప్రశ్నలు ఇకపై vasulegal@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని