close

తాజా వార్తలు

చింతమనేని అరెస్టులో రాజకీయ ఒత్తిడి లేదు

ఏలూరు: కులంపేరుతో దూషించినందుకే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేశామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవ్‌దీప్‌ గ్రేవాల్‌ తెలిపారు. ఆయన అరెస్ట్‌ వ్యవహారంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెదపాడులో వెంకటరత్నంపై దాడి చేసి కులం పేరుతో దూషించినందుకే చింతమనేనిపై కేసు పెట్టినట్లు చెప్పారు. ఆయనపై 9 కేసులు నమోదయ్యాయని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులన్నీ నాన్‌బెయిలబుల్‌వేనని చెప్పారు. చింతమనేనిపై మొత్తంగా 22 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ వ్యవహారంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదని తెలిపారు. తాను లొంగిపోతున్నట్లు చింతమనేని తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదన్నారు. చింతమనేని కేసుల వ్యవహారంలో మరికొందరని అరెస్ట్‌ చేయాల్సి ఉందని, వారి కోసం ఇతర ప్రాంతాల్లో రెండు బృందాలతో గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు