close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చర్మం పొడిబారకుండా...

కొత్తగా

చర్మం పొడిబారే సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అలాంటివారి కోసమే హ్యుమిడిఫయర్‌ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇది గాలిలో తేమ శాతాన్ని పెంచి చర్మం పొడిబారకుండా, పగలకుండా చేస్తుంది. జలుబుకు కారణమయ్యే క్రిముల నివారణకు తోడ్పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. ఇందులో ఎటువంటి ఎసెన్షియల్‌ నూనెలు వేయాల్సిన అవసరంలేదు. ఈ పరికరంతో పాటు యాంటీ మైక్రోబియల్‌ కోటింగ్‌తో ఒక వాటర్‌ ట్యాంక్‌ వస్తుంది. 2.4లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకుతో ఈ పరికరం 12 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇది ఆన్‌లైన్‌లో దొరుకుతోంది.


మరిన్ని