close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కళ్ల జోడుందా... అయితే ఏంటి?

చాలామంది ఎంత బాగా తయారైనా  కళ్లజోడు తమ లుక్‌ని మార్చేస్తుందని బాధపడుతుంటారు. దానికి ప్రత్యామ్నాయం లెన్స్‌. అలాగని రోజుల తరబడి వాటిని వాడుతుంటే... కళ్లు పొడిబారొచ్చు.  అద్దాలు ఉన్నా...మీరు మెరిసిపోవాలంటే...ఈ మెలకువలు పాటిస్తే సరి.
* వీలైనంతవరకూ జుట్టుని వదిలేసుకునే బదులు... జడ వేసుకోవడమే మేలు. అలాని మరీ బిగుతుగా కాకుండా ఫ్రెంచ్‌ బ్రెయిడ్‌, ఫిష్‌టెయిల్‌ వంటివి ప్రయత్నిస్తే... స్టైలిష్‌ లుక్‌ మీ సొంతం అవుతుంది.
* కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు కనుబొమలను తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. సన్నటి ఫ్రేమ్‌ వాడినప్పుడు కనుబొమల్ని మరీ దట్టంగా దిద్దొద్దు. అదే మందంగా ఉన్నవి వాడేటప్పుడు మాత్రం విల్లు ఆకృతిలో ఐబ్రోపెన్సిల్‌తో దిద్దుకోండి. దీనివల్ల మీ ముఖాకృతి చక్కగా కనిపిస్తుంది.
* కళ్లజోడు పెట్టుకున్నప్పుడు ఐషాడో అంత అందంగా అనిపించదు. కంటికి పెట్టుకునే లైనర్‌ మాత్రం కాస్త మందంగా ఉంటే... అద్దాల్లోంచి కళ్లు విశాలంగా కనిపిస్తాయి. అవుట్‌లైన్‌ కొత్తగా కనిపించేలా చేస్తుంది. నలుపు, బ్రౌన్‌ వంటి రంగులతో పాటు తెలుపు, గోధుమ వర్ణాల్నీ ప్రయత్నించొచ్చు.
* కళ్లు పెద్దగా కనిపించేందుకు మస్కారా అవసరం. మేకప్‌ మరీ అతిగా ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. పెదాలకు కాస్త ముదురు రంగు లిప్‌స్టిక్‌ బాగుంటుంది. చెవులకు స్టడ్స్‌ మాత్రమే కాదు... జుంకాలూ నప్పుతాయి.


మరిన్ని